ముల్కీ ఉద్యమం
అరాచకమైన నిజాం యొక్క పాలన నుండి విముక్తి లభిస్తుందని హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు పోలీస్ చర్యను స్వాగతించారు.
కానీ పోలీస్ చర్య తరువాత ఏర్పడిన మిలిటరీ పాలన (జనరల్ జె.ఎన్.చౌదరి పాలన), పౌర ప్రభుత్వ పాలన (ఎమ్.కె. వెల్లోడి పాలన) కాలంలో స్థానికేతరులను (నాన్ ముల్కీ) వివిధ ప్రభుత్వ ఉ ద్యోగాలలో నియమించబడడం జరిగింది.
పక్క రాష్ట్రాలైన మద్రాసు (ఆంధ్రా ప్రాంతంతో కలుపుకొని), బాంబే, ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి గంపగుత్తగా అధికారులను దిగుమతి చేసుకోవడం వలన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో చెలరేగిన అసంతృప్తి, అలజడుల రూపంలో బయటపడ్డాయి.
మద్రాస్ (అంధ్రా ప్రాంతంతో కలుపుకొని) నుండి వచ్చిన అధికారుల ప్రవర్తన అద్వాన్నంగా ఉoడేది.
మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ పనిచేస్తున్న అసమర్థులైన, నైతికత లోపించిన, ప్రవర్తన సరిగా లేనివారిని తప్పించడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి వారిని హైదరాబాద్ రాష్ట్రానికి పంపించడం జరిగింది.
దీనికి విరుద్ధంగా అనగా మద్రాసు రాష్ట్రం వలె కాకుండా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తమ అధికారులను హైదరాబాద్ రాష్ట్రానికి పంపించారు.
వీరు హైదరాబాద్ ప్రజలతో సత్సంబంధాలు కలిగి మంచి ప్రవర్తనతో మెలిగేవారు.
కానీ మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు స్థానికులపై ఆధిపత్యం చలాయిస్తూ, తమను తాము సంస్కర్తలుగా భావించి హైదరాబాద్ రాష్ట్ర ప్రజల పట్ల చులకన భావంతో మెదిలేవారు.
నిజాం పాలన పోయి భారత యూనియన్ పాలన వస్తే తమ బతుకులు బాగుపడతాయని భావించిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజల భ్రమలు తొందరగానే చెదిరిపోయాయి.
దీనితో పాటు ఈ non ముల్కీల (స్థానికేతరుల) వలన తమకు ఉద్యోగాలు రావేమోనని విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు,
ఇలాంటి పరిస్థితులలో 1952 మార్చిలో ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ప్రజా ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పడింది.
కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ముల్కీలకు అనగా స్థానికులకు మాత్రమే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఎన్నో అంచనాలు ప్రజలలో ఏర్పడ్డాయి.
కానీ వాస్తవంలో నానముల్కీలు నకిలీ ధృవ పత్రాలను సృష్టించి ముల్కీలుగా ఉద్యోగాలలో చేరడం వంటి విషయాలను బూర్గుల ప్రభుత్వం అరికట్టకపోవడంతో స్థానికులలో అభద్రతా భావం పెరిగింది.
ఈ అభద్రతా భావం వలన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలలో చెలరేగిన అసంతృప్తి వరంగల్‌లో అలజడుల రూపంలో బయటపడింది.
అదేరోజు (26 జూలై 1952) న హన్మకొండ వ్రాసోడ్స్ నుండి సు
విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి:
ప్రతి స్కూలు నుండి మరియు ప్రతి కళాశాల నుండి ఒక విద్యార్థి ప్రతినిధితో 1DAl మరో కార్యాచరణ కమిటీ ఏర్పడింది. ఈ విద్యార్థి ప్రతినిధులలో ఒక విద్యార్థి ప్రతిక్షన్స్ ఐక్య కార్యాచరణ కమిటీకి కన్వీనర్‌గా ఎన్నుకున్నారు.
ఈ కార్యచరణ కమిటీ 28 జూలై 1952 న ఒక తీర్మానాన్ని చేశారు.
తీర్మానం: ముల్కీ నిబంధనలను పరిశీలించడానికి ఒక క్యాబినెట్ సజీకమిటీని నియమించాలి.
ఈ క్యాబినెట్ సత్కమిటీ నియామకం అనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటన ద్వారా తెలియజేయాలి.
ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రికి పంపించగా ఆగస్టు 6 1959న ముఖ్యమంత్రికి చేరడం
22 ఆగస్టు 1952 న ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు వరంగల్ చేరుకొని విద్యార్థి కలిసి హైదరాబాద్ వెళ్ళిన తరువాత విద్యార్థుల డిమాండ్లను నెరవేరుస్తానని మాట ఇవ్వడం జన్నత
ఆగుస్టు 22 న ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం విద్యార్థి కార్యాచరణ కమిటీ సమావేశం అయి.
ఈ సమావేశ అనంతరం ఆగస్టు 24 1959 న ముఖ్యమంత్రికి మరొక లేఖను పంపారు.
ఈ లేఖలో 27 ఆగస్టు 1962 లోపున సబ్జెకమిటీ నియామకం జరగకపోయిన, ఒకవేళ విషయాన్ని ఒక ప్రభుత్వ ప్రకటన ద్వారా తెలియజేయకపోయినా 37 ఆగస్టు 1963 నుండి కాను కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ అంతటా జనరల్ (స్ట్రైక్ నిర్వహిస్తామని తెలపడం జరిగింది.
ముఖ్యమంత్రి గారు వారి డిమాండ్లను ఒప్పుకొని అధికారిక ప్రకటన కూడా బాడీ చేసినట్లు By ద్వారా తెలియజేశాడు.
కానీ ఆ సమాచారం విద్యార్థి కార్యాచరణ కమిటీకి అందించడంలో ఆలస్యం అయిన (స్ట్రైక్ కొనసాగించడం జరిగింది.
27 ఆగస్టు 1062 రోజున విద్యార్థులు శాంతియుతమైన ర్యాలీని నిర్వహించారు.
ఈ ర్యాలీ అనంతరం అన్ని కళాశాలలు, పాఠశాలలు ఎప్పటిలాగే ప్రారంభమయ్యాయి.
ఆగస్టు 30 న దురదృష్టవశాత్తు సుమారు 60 నుండి 100 మంది విద్యార్థులు తరగతులను తరగతులపైకి రాళ్ళను విసరడం జరిగింది.
దీంతో ఈ విద్యార్థుల గుంపును చెల్లాచెదురు చేయడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.
ఈ లాఠీచార్జిలో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు.
ఈ లాఠీచార్జి మరుసటి రోజు ఈ ఉద్యమం వరంగల్ లోనే కాకుండా ఇతర ప్రాంతాలైన ఖమ్మం, మహబూబాబాద్, ఇల్లందు, నల్గొండ, మిర్యాలగూడ మరియు భువనగిరి మొదలగు ప్రాంతాలలో పూర్తి స్థాయి హర్తాలు కొనసాగాయి.
హైదరాబాద్ ఉద్యమం:
ఆగస్టు 30న హన్మకొండ హైస్కూలు విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్ల్కు వ్యతిరేకంగా ఆగస్టు 31న హైదరాబాద్‌లో సమ్మెను నిర్వహించారు.
ఆగస్టు 31 1952 న సైఫాబాద్ కాలేజీ నుండి అబిడ్స్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
సెప్టెంబర్ 1 న బక్రీదు పండగ ఉండడం వలన ఆ రోజు ఎలాంటి స్ట్రైక్ జరగలేదు.
సిటీ కాలేజి సంఘటన:
పోలీస్ కమీషనర్ శ్రీ శివకుమార్ లాల్ (హెచ్.సి.ఎస్) మైక్రోఫోన్ల ద్వారా తల్లిదండ్రులకు తమ పిల్లలను జాగ్రత్తగా ఉండేలా. చూడమని, హింసకు పాల్పడవద్దని, అమర్యాదగా ప్రవర్తించవద్దని విన్నవించారు.
సిటీ కాలేజి ఒకవేళ ఎవరైనా వీటిని అతిక్రమిస్తే పోలీసులు తగిన చర్య తీసుకుంటారని హెచ్చరించారు.
సెప్టెంబర్ 2, 1952న ‘నానుల్కీ గోబ్యాక్’, ‘ఇడ్లీ సాంబార్ ఘర్‌కో జావ్’, ‘స్టూడెంట్స్ యూనియన్ జిందాబాద్’ వంటి నినాదాలతో విద్యార్థులు భారీస్థాయిలో ర్యాలీలు నిర్వహించారు.
30 ఆగస్టు 1952 నుండి 2 సెప్టెంబర్ 1952 వరకు జరిగిన ఈ ధర్నాలలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మరియు విద్యాసంస్థలు పాల్గొన్నాయి.
ఈ ధర్నాల సందర్భంగా జరిగిన సంఘటనల మూలంగా హైదరాబాద్ లో శాంతి భద్రతలు చాలావరకు ప్రభావితమయ్యాయి.
ప్రభుత్వం 3 సెప్టెంబర్ 1952న ఒక ప్రకటన ద్వారా నిషేదిత ఆజ్ఞలను జారీ చేయడం జరిగింది.
సెప్టెంబర్ 3 1952న సిటీ కాలేజ్ మరియు పత్తరట్ ప్రాంతాలలో ముల్కీ ఉద్యమకారుల పై పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ కాల్పులలో ఇద్దరు చనిపోగా 147 మంది గాయపడ్డారు.
సెప్టెంబర్ 4, 1952 అఫ్టల్ గంజ్ ప్రాంతంలో ముల్కీ ఉద్యమకారులపై పోలీసులు కాల్పులు జరిపారు.
అఫ్టల్గంజ్ వద్ద జరిగిన కాల్పులలో నలుగురు చనిపోగా, 104 మంది గాయపడ్డారు.
ఇటువంటి సమయంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయిన బూర్గుల రామకృష్ణారావు రంగంలో దిగి ఆందోళన కారులను శాంతింపచేయడానికి ప్రయత్నించినా ఆందోళనకారులు వినలేదు.
సెప్టెంబర్ 3 మరియు సెప్టెంబర్ 4 వ తేదీలలో ఆందోళన కారులను శాంతింపచేయడానికి ప్రయత్నించిన ఇతర ప్రముఖులు / రాజకీయనాయకులు / ప్రజా ప్రతినిధులు:
* వి.డి. దేశ్ పాండే (కమ్యూనిస్టు పార్టీ)
* ఓంకార్ ప్రసాద్ (కమ్యూనిస్టు పార్టీ)
* డాకర్ జయ సూర్వా నాయుడు (పరోజినీ నాయుడు కుమారుడు.
* పద్మజానాయుడు (సరోజినీ నాయుడు కుమార్తె)
* డా॥ మేల్కొటే
* శ్రీ బాకర్ అలీమీర్జా
* శ్రీ వెంకటస్వామి
రామాచారి- ముల్కీ ఉద్యమం:
నిజాం ప్రభుత్వంలో రాయబారి ‘లాయ’ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశాడు.
ఇతను మరాఠీ ప్రాంతానికి చెందిన వ్యక్తి.
1952 సాధారణ ఎన్నికలలో శాసన సభ్యుడుగా ఎన్నికయ్యారు.
ఇతను 1952 ఆగస్టులో ‘హైదరాబాద్ హిత రక్షణ సమితి’ ని స్థాపించాడు.
ఈ సమితి ద్వారా నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నిర్వహించాడు.
రామాచారి నేతృత్వంలో కొనసాగుతున్న ఉద్యమాన్ని
* ప్రోత్సహించిన గొప్పనాయకుడు
• హయగ్రీవాచారి.
* పరోక్షంగా ప్రోత్సహించిన మంత్రులు
కె.వి.రంగారెడ్డి
* మర్రి చెన్నారెడ్డి
1952 సెప్టెంబర్ 5న ఫతేమైదాన్‌లో బహిరంగసభ
ప్రతిపక్షనాయకుడు వి.డి. దేశ్‌పాండే (P.D.F) ఉద్యోగాలలో ముల్కీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మద్దతు తెలిపాడు.
సోషలిస్టు పార్టీ నాయకుడు ‘మహదేవ్సంగ్’ పోలీసుల కాల్పులను ఖండించి ముల్కి ఉద్యమానికి సంపూర్ణమద్దతు తెలిపాడు.
కృష్ణదేవరాయల భాషా నిలయం స్వర్ణోత్సవములు 1952 సెప్టెంబర్ 5 న సుల్తాన్‌బజార్‌లో జరిగినాయి.
సమావేశానికి ముఖ్య అతిధిగా ‘ బూర్గుల రామకృష్ణారావు’ హాజరయ్యారు.
ముల్కీ ఉద్యమకారులపై జరిగిన కాల్పులకు నిరసనగా బూర్గుల యొక్క కారును సెప్టెంబర్ 6న ఆందోళనకారులు తగులబెట్టారు.
ఈ సంఘటన జరగడంతో స్వామి రామానంద తీర్థ విద్యార్థుల వెనకాల సంఘ విద్రోహశక్తులున్నాయని పేర్కొన్నాడు.
ఆ తర్వాత కాలంలో ఉపఎన్నికల ప్రచారానికి వరంగల్ వెళ్ళిన రామనంద తీర్థ కారుకు కూడా విద్యార్థులు నిప్పంటించారు.
ఈ విధంగా ముల్కీ ఉద్యమంలో విద్యార్థులు అత్యంత కీలకపాత్ర పోషించారు.
ప్రభుత్వ చర్యలు:
> ముల్కీఉద్యమం యొక్క ఉధృతిని గమనించిన ప్రభుత్వం సెప్టెంబర్ 7న ముల్కీ నిబంధనల పరిశీలన కోసం ఒక మంత్రివర్గ ఉపసంఘంను నియమించింది.
ఈ మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులు
* కొండా వెంకటరంగారెడ్డి (ఎక్సైజ్ శాఖామంత్రి)!
డా॥ మెల్కోటే (ఆర్థికమంత్రి)
పూల్‌చంద్ గాంధీ (విద్యాశాఖ మంత్రి)
* నవాజ్ంగ్ (పబ్లిక్ వర్క్స్ శాఖమంత్రి)
> మంత్రివర్గ ఉపసంఘం బాధ్యతలు
అమలులో ఉన్న ముల్కినిబంధనలు పరిశీలించడం.
మెహదీ నవాజ్ జంగ్
* విద్యార్థులను ఇతర సంస్థలను కలుసుకొని వివిధ అభిప్రాయాలను సేకరించి నివేదికను సమర్పించారు.
పోలీసుల కాల్పులపై విచారణ జరిపేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి ‘పింగళి జగన్మోహనరెడ్డి’ ఆధ్వర్యంలో న్యాయ విచారణ సంఘాన్ని నియమించింది.
జస్టిస్ పింగళి జగన్మోహనరెడ్డి యొక్క ఆత్మకథ ‘ది జుడిషియరీ ఐ సర్వ్ డ్’.
‘ది జుడిషియరీ ఐ సర్వ్ డ్’ అనే తన ఆత్మకథలో తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్ర అధికారుల దుష్ప్రవర్తన వల్లనే ముల్కీ అల్లర్లు తెలంగాణ ప్రాంతమంతటా వ్యాపించాయని పేర్కొన్నాడు.
ముల్కి ఉద్యమ అనంతరం:
విశాలాంధ్ర దినపత్రికలో నాన్ ముల్కీలందరిని వెనక్కుపంపి ఆ స్థానాలలో స్థానికులను నియమించాలని పేర్కొన్న నాయకులు :
* వి.డి.దేశ్పాండ్ —
* రాజ్ బహద్దూర్ గౌడ్
సెప్టెంబర్ 13న ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అరెస్ట్ కాబడ్డ శాసన సభ్యుడు
* సయ్యద్ అక్తర్ హుస్సేన్.
‘సయ్యద్ అక్తర్ హుస్సేన్’ ఆవాద్ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు.
ఇతనితో పాటు అరెస్టు కాబడ్డ మరో పాత్రికేయురాలు
* బేగం సాదిక్ జహన్.
జస్టిస్ పింగళి జగన్మోహన్రెడ్డి కమిటీ:
సెప్టెంబర్ 3 మరియు 4 తేదీలలో జరిగిన కాల్పులపై విచారణ చేపట్టేందుకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 5 న జస్టిస్ పింగళి జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయడం జరిగింది.
జస్టిస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు షరతుల మీద ఈ విచారణ కమిటీకి నేతృత్వం వహిస్తానని చెప్పడం జరిగింది.
షరతులు:
* విచారణను ప్రజల మధ్య చేపడతానని పేర్కొనడం
* ఆ విచారణ కూడా హైకోర్టు ప్రాంగణంలోనే చేపడతానని పేర్కొన్నాడు.
ప్రభుత్వం ఈ రెండు షరతులకు అంగీకరించి సెప్టెంబర్ 9, 1952 న ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
కమిటీ చేపట్టాల్సిన విచారణను గురించిన విధి విధానాలు సవివరంగా తెలుపుతూ సెప్టెంబర్ 10 1952న జస్టిన్ జగన్మోహన్రెడ్డి గారికి ఒక లేఖ రాసింది.
.జగన్మోహన్ రెడ్డి
ఈ లేఖలో ఉన్న సారాంశం ఏమిటంటే:
1. ఎలాంటి పరిస్థితులలో సెప్టెంబర్ 3 మరియు సెప్టెంబర్ 4 తేదీలలో హైదరాబాద్‌లో ఆందోళన కారులపై కాల్పులు జరిగాయి, దానికి దారితీసిన పరిస్థితులేమిటి?
2. ఏమైనా అవసరమైతే విద్యార్థుల యొక్క నిరసన గురించి కూడా విచారణ చేపట్టాలి.
జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ తన యొక్క సమగ్రమైన నివేదికను 28 డిశంబర్ 1952 న ప్రభుత్వానికి సమర్పించింది.
ఈ నివేదికకు అనుబంధాలను కూడా జతచేయడం జరిగింది. (ఇందులో కొన్ని అనగా కాల్పులు ఎక్కడ జరిగాయి, గుంపులను ఎక్కడి నుండి సమీకరించారు?
సుమారు 100 మంది సాక్షులను విచారించారు.
కమీషన్ విచారించిన సాక్షులు :
* బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి)
* మోనప్ప (ఐ.జి.పి)
* శివకుమార్‌లాల్ (కమీషనర్ ఆఫ్ పోలీస్)
* సుందరం పిళ్ళై (డి.సి.పి)
* సుబ్బయ్య (బ్రిగేడియర్)
* హైదరాబాద్ కలెక్టర్
* ఇతర ప్రభుత్వ అధికారులు
* శ్రీ రాంలాల్ (నిజాం కాలేజ్ ప్రిన్సిపల్)
* పై వారే కాకుండా గుంపులను శాంతింప చేయడానికి ప్రయత్నించిన ఇతరులు, ఆందోళనలను చూసిన వారిని, విద్యార్థులను కూడా విచారించారు.
* సెప్టెంబర్ 4 న అఫ్టల్ గంజ్‌లోనే ఉన్నందుకు ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావును కూడా. విచారించడం జరిగింది.
ఈ విచారణ అనంతరం జస్టిస్ జగన్మోహన్ రెడ్డి కమిటీ తన యొక్క సమగ్రమైన నివేదికను 28 డిశంబర్ 1952 న ప్రభుత్వానికి సమర్పించింది.
కమిటీ రిపోర్ట్
* మొదటిసారి అఫ్టల్ ంజ్లో కాల్పులు జరిగినపుడు ప్రజాప్రతినిధులు మరియు నాయకులు, పోలీసు అధికారులు, పోలీసు బలగాల మధ్య సమన్వయ లోపం కొరవడినట్లు తెలుస్తుంది.
* అందువలన కాల్పులు జరిపినప్పటికినీ ఆందోళనలను పూర్తిస్థాయిలో ప్రతిభావంతంగా అదుపుచేయలేకపోయారు.
* సరియైన సందర్భంలో పోలీసులు ఖచ్చితంగా వ్యవహరించలేకపోయారని ఋజువైంది.
* కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులకు కేవలం పోలీసులను మాత్రమే తప్పుపట్టడం సరియైంది కాదు. ఎందుకంటే అలాంటి పరిస్థితి రావడానికి ప్రధాన కారణం ప్రజానాయకులు కాబట్టి.
* ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు ఆందోళనకారుల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం ఆందోళనకారులు విజృంభించడానికి కారణంగా చెప్పవచ్చు.
* పోలీసులు సరిగా స్పందించకపోవడం మరియు ప్రజానాయకులు సరిగా కల్పించుకోకపోవడం వెరసి ఆందోళనకారులు, విద్యార్ధులు చెలరేగిపోయారు.
* కమిటీ చైర్మన్ నా ముందు రెండు ప్రశ్నలు ఉద్భవించాయి.
1) కాల్పులు జరపాల్సినంత అవసరం నిజంగా ఏర్పడిందా?
2) ఆ సమయంలో కావాల్సిన బలగాలను ఉపయోగించారా లేదా అతిగా ప్రవర్తించారా?
4. మొదటి ప్రశ్నకు సమాధానంగా కమిటి చేపట్టిన విచారణ లో సాక్షులను సాక్ష్యాలను బట్టి, అలాంటి పరిస్థితుల్లో ఆ గుంపును చెల్లా చెదురు చేయడానికి కాల్పులు జరపడం ఎంతో అనివార్యం. దానికి మించిన వేరే మార్గం లేదు.
* అన్ని రాజకీయ పార్టీల నాయకులు అన్ని రకాలుగా ప్రయత్నించిన ఆందోళనకారులను శాంతింపజేయడంలో విఫలం అయ్యారు.
* జనసమూహం చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది సాక్షులు చెప్పినదాని ప్రకారం 40,000 వరకు ఉండవచ్చు.
* ఆందోళనకారులు ఎక్కువ మంది ఉండడం వారు ఎలాగైన ర్యాలీ తీయాలనే సంకల్పంతో ఉండటం, వైర్లెస్ వ్యాస్‌ను తగులబెట్టడం, భారీ స్థాయిలో పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీస్ స్టేషన్‌పై దాడిచేసేలా కనిపించడం వంటివి పోలీసులు కాల్పులకు ఉపక్రమించేలా చేశాయి.
* లాఠీచార్జి, టిమర్ గ్యాస్ వంటి అంతపెద్ద జనసమూహంపై అంతగా ప్రభావాన్ని చూపలేకపోయాయి.
* రెండవ ప్రశ్నకు సమాధానంగా, పోలీసులు ఆందోళనకారులను అదుపుచేయగలమనే నమ్మకంతో ఉన్నపుడు కాల్పులు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే ఉపయోగించాలి. తద్వారా ఆందోళనకారులు చెల్లాచెదురైపోతారు. అప్పుడు కాల్పులు ఆపేయొచ్చు.
* విచారణ ద్వారా తెలిసేదేమిటంటే విద్యార్థులు కొన్ని అపోహలు, భయాలను దృష్టిలో పెట్టుకొని ఆందోళనకు దిగారు.
దీనిని రాజకీయ పార్టీలు వారి ప్రయోజనాలకు వాడుకున్నారు లేదా రాజకీయ పార్టీలు ఆందోళ ప్రారంభించి దానిని ముందుకు కొనసాగించడానికి విద్యార్థులను వాడుకున్నారు.
* కాబట్టి విద్యార్థులకు మరియు వారియొక్క భవిష్యత్తు కోరుకునే వారి తల్లిదండ్రులు వారు సరి పద్దతిలో క్రమశిక్షణతో ఋజుప్రవర్తన కలిగిన పౌరులుగా చూడాలని కోరుకుంటున్నాము.