విశిష్టకృతియైన మహాభారత సంహితలో విదురుడు చాలా ప్రముఖమైన వ్యక్తి.ఒక రకంగా కురువంశరాజులైన ధృతరాష్ట్ర పాండురాజులకు ఆయన సవతి తమ్ముని వంటివాడు. విచిత్రవీర్యుడు సంతానహీనుడుగా మరణించిన సమయంలో అతని తల్లి సత్యవతి తన కుమారుడైన వ్యాసమహర్షిని తలచుకొనినంతట, ప్రత్యక్షము కాగా తన కుమారుని భార్యలైన అంబిక, అంబాలికలక పుత్రప్రాప్తి కలిగించి కురువంశానికి ఉత్తర వారసులను ప్రసాది అంబిక వ్యాసుని చూడగానే భయంతో కనులు మూసుకొన్న కన్నులే లేని అనగా గ్రుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మింప అం భయంతో తెల్లబోగా ఆమెకు పాండురోగి అయిన పాండురాజు రాణులు వ్యాసుని వద్దకు తమ దాసిని పంపగా ఆమె వ్యాసుని కారణము చేత ఆమెకు విదురుడు జన్మించాడు. మహా ధర్మ అయినప్పటికీ, దాసీ పుత్రుడైన కారణము చేత విదురునికి రాజ్యా కొన్ని ఐతిహ్యాల ప్రకారం మాండవ్య మహామునిని కొరత వేసిన శిక్షకు కారణమైనందున యమధర్మరాజును ఆ మహాముని మానవునిగా జన్మించమని శపించాడని అందుచేత విదురుడు యమధర్మరాజు అవతారమని తెలుస్తున్నది. విదురుడు బాల్యం నుంచి భీష్ముని సంరక్షణలో పెంచబడ్డాడు. ఆయనకు రాజ్యార్హత లేనందువలన సోదరుడైన ధృతరాష్ట్ర పాండురాజులకు మంత్రిగా నియమింపబడ్డాడు. వాస్తవానికి అంధుడైన ధృతరాష్ట్రుడు రాజైన తర్వాత విదురుడే రాజ్య సంబంధమైన సమస్త రాజ్య వ్యవహారములను చక్కపెడుతూ దుర్యోధనునికి యుక్తవయస్సు వచ్చునంత వరకూ రాజ్యభారాన్ని వహించాడు. ఒక అభిప్రాయం ప్రకారం విదురుడు ధృతరాష్ట్రుడు, పాండురాజు ఇద్దరు సోదరుల కంటే పెద్దవాడని భీష్ముడు ఒకసారి ముగ్గురు రాజకుమారులకు తగిన భార్యలను తెలుప వలసినదిగా కోరగా విదురుడు తనకు ఒక యాదవ బాలికను ధృతరాష్ట్రునకు గాంధారిని, పాండురాజుకు మాద్రిని వారి వయసుల ప్రకారం నిర్ణయించాడని తెలుస్తున్నది. విదురుని జన్మను గురించి మరికొన్ని బహిత్యాలు ప్రచారంలో ఉన్నాయి. ఆయన మిత్రావరుణుల జంటకు బదులుగా ధర్ముడే విదురునిగా అవతారం దాల్చారని ఒక గాథ.
విదురుడు నిరంతరం ప్రజా సంక్షేమాన్ని ఆకాంక్షించినవాడు కావున, ఆయనకు గల విశేష ధర్మజ్ఞానము చేతనే అనేకమార్లు పాండవులను హతమార్చటానికి దుర్యోధనుడు పన్నిన కుయుక్తులను ముందుగనే ధృతరాష్ట్రునికి తెల్పి ఆయనను హెచ్చరించి వానిని విఫలం చేశాడని అలాగే పాండవులను లక్క ఇంటిలో ఉంచి దహనం చేసి అంతమొందించాలనే దుర్యోధనుని కుట్ర విదురుని వలననే భగ్నమైనదని తెలుస్తున్నది. రాజనీతికి, సమగ్ర జ్ఞానానికి విదురుడు ప్రతిరూపం.
శ్రీకృష్ణుడు తన ఎడ విదురునికి గల భక్తి ప్రజాక్షేమము యెడల గల ఆసక్తి అన్ని విషయములలోనూ ఆయనకు గల జ్ఞానసంపత్తి కృష్ణుని మనస్సును చూరగొన్నది.
శ్రీకృష్ణుడు కేవలం మానవమాత్రుడు కాదని ఆయన సాక్ష్మాన్మహా విష్ణువు అపరావతారమని మహా భారత వృతాంత్తంలోని కథలో తెలిసిన ఏడుగురిలోను ఆయన ఒకడు. శ్రీకృష్ణుడు పాండవుల పక్షాన దూతగా హస్తినాపురానికి వచ్చినప్పుడు ఆయనకు తన రాజగృహంలో ఆతిథ్యం ఇవ్వచూపిన దుర్యోధనుని అభ్యర్ధనను నిరాకరించి, కౌరవ పాండవులకు తటస్థుడు అయినందున విదుదుని గృహములో ఆతిథ్యం స్వీకరిస్తానని తెలియజేస్తాడు. నిండు కౌరవ సభలో కౌరవులు ద్రౌపదిని అవమానించినప్పుడు దుశ్శాశనుడు ఆమె వలువలను ఊడ్చిన సమయంలో నూర్గురు కౌరవులలో ఒకడైన వికర్ణుడు, విదురుడు మాత్రమే ఆ చర్యను నిరసించారు. అడ్డు చెప్పారు. శ్రీ కృష్ణుడు విదురుని సత్యానికి అధిపతిగా భావించేవాడు. శ్రీ కృష్ణుడు విదురుని గృహములో ఆ రాత్రి బస చేయడానికి దుర్యోధనుని సౌధములోబస నిరాకరించడానికి ధృతరాష్ట్రుని మనస్సులో గల అంతర్యాలే కారణం. శ్రీ కృష్ణుడు హస్తినాపురానికి దూతగా రాగా దుర్యోధనుడు ఆయన సహచరులు కృష్ణునికి అతి ఆడంబరంతో స్వాగత సత్కారాలను ఏర్పాటు చేశారు. సర్వ రుచికర పదార్థాలతో విందు ఏర్పాటు చేసి శ్రీ కృష్ణుడు ఆ పదార్థాలను తృప్తిగా తినిన తర్వాత తమకు సహాయకుడు కాగలడని దుర్యోధనుడు ఆశించాడు. దుర్యోధనుని కుయుక్తిని ముందే పసిగట్టిన శ్రీ కృష్ణుడు అందుకు నిరాకరించి, విదురుని గృహంలో బస చేశాడు. తన విందును శ్రీ కృష్ణుడు స్వీకరించి తృప్తి చెందేటట్లైతే అతని నుంచి వరం తీసుకొని తన వైపుకు కృష్ణుని త్రిప్పుకొని పాండవులను సర్వనాశనం చేయవచ్చుననే దుర్యోధనుని దురూహ ఆ విధముగా భగ్నమైపోయింది. విదురుడు తనకు ఇచ్చే ఆతిథ్యము ప్రేమతోనూ అభిమానంతోనూ ఉంటుందనే ఆయన విదురుని అభ్యర్ధనను అంగీకరించాడు. శ్రీకృష్ణుడు తన భక్తులను అభిమానించేవాడే కదా!
కురుక్షేత్ర యుద్ధం కొద్ది కాలంలోనే మొదలవుతుందనే విషయం స్పష్టమైన తరువాత విదురుడు ధృతరాష్ట్రునికి నీతిని ఉపదేశించి, ధర్మ విషయాలను బోధించటానికి తాను అర్హుడు కానని మరణాన్ని గురించిన విషయాలను తెలియజేయడానికి సనత్సుజాతుని ఆరాధించి, అతనితో ధృతరాష్ట్రునికి హితబోధ చేయించాడు. కురుక్షేత్ర యుద్ధం జరగటానికి పూర్తిగా విముఖుడైనందున విదురుడు తన మంత్రిత్వాన్ని విసర్జించాడు. 18 రోజుల మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత విజేతయైన ధర్మరాజు సర్వ అధికారాలతో విదురుని ప్రధానామాత్యునిగా నియమించాడు. అయినా యుద్ధ బీభత్సం, తన వయస్సులను పరిగణనలోనికి తీసుకొనిన విదురుడు పరిపాలనలో భాగం పంచుకోవడానికి ఇష్టపడలేదు. ఆ తర్వాత కొద్దికాలానికే ఆయన తన సోదరుడైన ధృతరాష్ట్రుడు వదినలైన గాంధారీ, కుంతులతో ఆశ్రమవాసాన్ని స్వీకరించి వానప్రస్థ జీవనం గడపడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయారు. అక్కడ కొంతకాలం పాటు తీవ్రంగా తపస్సు చేసి రాజవనప్రస్థులలో అందరి కంటే ముందుగా మరణం చెందాడు.
రాజనీతిని గురించిన అనేక విషయాలతో కూడిన విదుర, ధృతరాష్ట్ర సంవాదమైన విదురనీతి ఒక రకంగా చాణక్య నీతికి ఇంకా అసంఖ్యాక నీతిగ్రంథాలకు ఆధారప్రాయ రచన అని భావించవచ్చు.
విదురుడు సత్యానికి విధేయతకు పక్షపాతరహిత విధానాలకు దూతగా ధర్మప్రతినిధిగా భావించవచ్చు. విదురుడు మహాభారతం యొక్క అంతరిక భావాత్మకతకు ప్రతినిధి.