Telangana jatharalu

Telangna Jatharalu 

 

 తెలంగాణలోని జాతరలు  : 

అదిలాబాద్ జిల్లాలోని గోండులు నాగోబా జాతరను ప్రతిసంవత్సరం పుష్య బహుళ అమావాస్య రోజున జరుపుకుంటారు. ఇది ఉట్నూర్ మండలంలో కెస్లాపూర్ అనే గ్రామంలో ( ITDA హెడ్ క్వార్టర్స్కి 20 కి.మీల దూరంలో) జరుపుకుంటారు.

 

* నాగోబా అనగా పామును దేవతారూపంలో పూజిస్తారు.

 

* ఈ సందర్భంగా ఈ తెగవారు తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.

 

* 1940లో ప్రొఫెసర్ హైమెన్స్టార్స్ అనే గిరిజన స్కాలర్ ఈ సందర్భంగా గోండు దర్బార్ ను నిర్వహించి దానికి జిల్లా కలెక్టర్ను ఆహ్వనించి వారి సమస్యలు విన్నవించుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించాడు. అది ఇప్పటికీ కొనసాగుతుంది.

 

సమ్మక్క-సారలమ్మ జాతర:

* ఈ జాతర పవిత్రత, దైవత్వం మరియు చరిత్రల మిశ్రమంగా చెప్పవచ్చు.

* ఈ జాతరలో సమ్మక్క దేవతారూపంలో పూజలందుకుంటుంది.

 

* 12వ శతాబ్దంలో కోమరాజు పగిద్ద రాజును వివాహం చేసుకుంటుంది. ఇతడు మేడరాజు మేనల్లుడు, వీరు తొలి కాకతీయులకు సమకాలీనులు.

* సమ్మక్క-సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కోతో గుర్తింపు పొంది ప్రసిద్ధికెక్కింది. సుమారు 2 కోట్లమంది ఈ జాతరకు వచ్చి సమ్మక్క- సారలమ్మను పూజిస్తారు.

 

* దీనియొక్క గొప్పప్రాధాన్యతను గుర్తించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 01/02/1996 న ఈ జాతరను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది.

 

* దీనిని ప్రతి రెండు సంవత్సరాలకొకసారి మాఘమాసంలో పౌర్ణమి రోజున వరంగల్ జిల్లా మేడారంలో జరుపుకుంటారు.

 

* ఈ జాతరలో పూజారులు గిరిజనులు

 

* ఈ జాతరకు గిరిజనుల కంటే గిరిజనేతరులే ఎక్కువ సంఖ్యలో హాజరవుతారు.

 

* సమ్మక్క-సారక్క జాతర మొత్తం నాలుగు రోజులు నడుస్తుంది.

 

* మొదటి రోజు – కన్నెపల్లి నుండి సారక్కను గద్దెకు తీసుకువస్తారు.

 

* రెండవ రోజు – చిలుకలగుట్టలో ఉన్న గద్దెపై సమ్మక్కను ప్రతిష్టిస్తారు.

 

* మూడవరోజు – గద్దెలపై అమ్మవార్ల ఇద్దరిని కొలువు చేస్తారు.

 

* నాలుగవరోజు-ఆవాహనం పలికి సాయంత్రమున అమ్మవార్లిద్దరిని తిరిగి యుద్దరంగానికి తరలిస్తారు. దీనితో జాతర ముగుస్తుంది.

 

నిషాని దేవత (Nishani Devata):

*ఈ దేవత విశాఖపట్నంలోని షెడ్యూల్డ్ ఏరియా తెగల యొక్క గ్రామ దేవత.

 

* తెలుగు నూతన సంవత్సర పండుగ ఉగాది (లేదా) చైత్ర పండుగ సందర్భంగా నిషాని దేవతను పూజిస్తారు. చైత్రమాసంలో జరుపుకుంటారు కాబట్టి దీనిని ‘చైత్ర పురబ్’ అని పిలుస్తారు. ఇది ఎటికల (Etikala) పండుగగా (లేదా) (Eetela) ఈటెల పండుగగా బాగా ప్రఖ్యాతి.

 

* ఇది ఖమ్మంలోని గిరిజన ప్రాంతాలలో కూడా వేరే పేరుతో జరుపుకుంటారు.

 

* ఈ పండగ సందర్భంగా గ్రామ పూజారి (దేసరి) ఒక అబ్బాయిని ఎన్నుకొని, అతనికి బాణం మరియు విల్లు ఇచ్చి అతడు సూచించిన దిశలో అడవిలోకి పరుగెత్తమని చెప్తాడు. ఇతని వెనకాల డ్రమ్స్ వాయిస్తూ వెళ్తారు.

 

* గ్రామంలోని ఇతర పురుషులు అతనిని అనుకరిస్తారు. వారు విజయవంతంగా దేనినయినా వేటాడి తెచ్చి గ్రామ దేవత నిషాని దేవతకు మొదటగా సమర్పిస్తారు.

 

పెద్ద దేవుడు (Pedda Devudu) : 

* తెలంగాణలోని గిరిజనులు వైశాఖ మాసంలో గ్రామ సంక్షేమం కోసం పెద్ద దేవుడు గౌరవార్ధం ఈ పండుగను జరుపుకుంటారు.

 

* భూమిలో త్రిభుజాకార ఆకృతిలో ఒకరాయిని పాతిపెట్టి దేవునిగా కొలుస్తారు…

 

* పరిగిపిట్టను ఈ సందర్భంగా బలిస్తారు. పరిగిపిట్టను పెద్దదేవుడికి ఇష్టమైనదిగా పరిగణిస్తారు.

 

* బలి ఇచ్చిన మేక, పరిగిపిట్టల రక్తాన్ని ఒక కుండలో ఉంచి దేవుని ముందు పెడతారు. దేవుడు ఎలుక రూపంలో వచ్చి దానిని ఆహారంగా స్వీకరిస్తాడని వారి నమ్మకం.

 

* ఈ పండుగను పొలాలను సాగుచేయడానికి ముందు అనగా మే లేదా జూన్ మొదటి వారంలో మంచి వర్షాలు రావాలని కోరుకుంటూ జరుపుకుంటారు.

సీత్ల (Seethla) :

* సీత్ల పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో లంబాడీలు జరుపుకుంటారు.

* ఇది బలుల (Sacrifices) పండుగగా కూడా పిలుస్తారు. ఎందుకంటే చాలా జంతువులను ఈ పండుగ సందర్భంగా బలిస్తారు.

* ఈ పండుగకు ముందురోజు తండా పెద్దలు సమావేశం అయ్యి పండుగ గురించి చర్చిస్తారు.

 

* తండాలోని అన్ని కుటుంబాలు కలిసి ఒకమేకను కొనుగోలు చేస్తారు.

 

* పండుగరోజు అందరు వారివారి ఇళ్ళలో స్నానాలు చేసి కొత్త బట్టలు లేదా ఉతికిన బట్టలు ధరిస్తారు.

 

* తండా అవతల పండగ జరుపుకోవడానికి ఒక స్థలాన్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళి ఏడు రాళ్ళను ఆ స్థలంలో పాతుతారు. ఈ ఏడు రాళ్ళు వారి ఏడుగురి దేవతలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. (సీత్ల నుండి సీత్ల భవానీ వరకు).

 

* ఈ దేవతలను సరిగ్గా పూజించకపోతే వారియొక్క పశువులు వివిధ రోగాల బారిన పడి చనిపోతాయని వీరినమ్మకం.

తీజ్ పండుగ (Teej Festival) : 

* లంబాడాలు తీజ్ పండుగను శ్రావణ మాసంలో వర్షాలు బాగా పడి భూమిసాగుకు తయారైన సందర్భంగా జరుపుకుంటారు.

 

* ఈ పండుగను 9 రోజులపాటు రోజుకో వైవిధ్యంతో నృత్యాలు, పాటలతో జరుపుకుంటారు.

 

* ఈ పండుగ పెళ్ళికాని వారు మాత్రమే జరిపిస్తారు. పెళ్ళి అయిన ఆడ, మగ మరియు వితంతువులు ఈ పండగకు దూరంగా ఉంటారు.

 

* పండుగ మొదటి మరియు చివరి రోజులు చాలా ముఖ్యమైనవి.

* చివరిరోజు చాలా ముఖ్యమైనది ఈ రోజు పరమాన్నంను మరియు నెయ్యిని సేవాభయ్యా దేవుడికి సమర్పిస్తారు.

 

* మేరమ్మ అనేపేరు మీద మేకను బలి ఇస్తారు. ఇది ఈ పండుగ యొక్క ప్రత్యేకత.

 

* తండా యొక్క నాయకుడు ఈ రోజు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి.

 

+ చివరిరోజు పవిత్రమైన తీజ్గంపలను నీటిలోకి వదులుతారు..

 

* ఈ పండుగ సమయంలో పెళ్ళికాని వారు కొన్ని పదార్థాలు అనగా మిరపకాయలు, ఉప్పు, మాంసం వంటివి తినకూడదు.

 

 

పెర్సపెన్ (Persa Pen) : 

* గోండు తెగ సభ్యులంతా వారి తెగ దేవుడైన పెర్సపెన్ను పూజిస్తారు.

 

* ప్రతి సంవత్సరం ఈ పండుగను ఏప్రిల్-మే నెలలలో మరియు డిసెంబర్-జనవరి నెలల్లో జరుపుకుంటారు.

 

అకిపెన్ (Akipen):

* అకిపెన్ అనగా గోండుల యొక్క గ్రామ దేవత.

* గోండులు మొదటగా కాసిన పూవులు కాని, కాయలు, పళ్ళు కాని మొదట వారి గ్రామ దేవత అయిన అకిపెన్కి సమర్పిస్తారు.

 

* ప్రతి సంవత్సరం జంతు బలిని ఇచ్చి గ్రామదేవత అకిపెన్ను పూజిస్తారు.

 

* ఈ పండుగను గోండు మాండలికంలో నొవోంగ్ (Nowong) అంటారు.

 

* టేకు కలప మరియు ఆకులు కోయడానికి కంటే ముందు వారు రాజుల్ ముండ (Rajul Munda) అనే పండుగను జరుపుకుంటారు.

 

* వీరికి ముగ్గురు మతపరమైన విధులు నిర్వర్తించేవారు ఉంటారు.

 

దేవరి – గ్రామదేవతను పూజిస్తారు.

 

* కటోడా – తెగల దేవతలను శాంతింపజేస్తారు.

 

* భత్కాల్ – గ్రామస్థుల సంక్షేమాన్ని ముందుగానే చెబుతాడు.

 

ఇతర జాతరలు : 

 

1. ఏడుపాయల జాతరః

 

> ఈ దేవాలయం మంజీరానది ఏడుపాయలు వేరుపడే చోట నిర్మించబడింది.

> ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున ఈ జాతర నిర్వహిస్తారు.

 

> ఈ దేవాలయం మంజీరానది ఏడుపాయలు వేరుపడే చోట ఉంది. కావున ఈ జాతరను ఏడుపాయల జాతరగా పేర్కొంటారు.

 

> నాగాసాన్పల్లి (మెదక్) గ్రామంలో అమ్మదుర్గాభవాని దేవాలయం ఉంది. మెదక్ పట్టణానికి దాదాపు 15 కి.మీల దూరంలో ఉంది. ఇది పర్యాటక కేంద్రం.

 

> ఈ జాతరను మూడు రోజుల పాటు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.

 

> ఇక్కడికి వచ్చిన భక్తులు ఏడుపాయల స్నానం ఆచరిస్తారు.

 

> ఈ జాతరలో పాల్గొన్న భక్తులు గుడిలో ఒకరోజు రాత్రి నిద్రచేసి తమ సొంత గ్రామాలకు వెళ్ళడం ఆచారంగా కొనసాగుతుంది.

 

2. గొల్లగట్టు జాతర:

> తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క-సారక్క జాతర తరువాత రెండవ అతిపెద్ద జాతర గొల్లగట్టు జాతర

 

> ఈ జాతర ప్రతి రెండు సం॥లకొకసారి నిర్వహిస్తారు.

 

> నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.

> యాదవుల కులదైవం లింగమంతుల స్వామి (పరమశివుడి అవతారం)

 

> లింగమంతులస్వామి తోబుట్టువు – చౌడమ్మతల్లి

 

> ఈ జాతరలో కేసారం గ్రామానికి 30విగ్రహాలున్న పెట్టెను తీసుకొని వెళ్ళి హక్కుదారులకు చూపించి పూజలుచేస్తారు.

 

> ఆ తరువాత లింగమంతులస్వామి తోబుట్టువు అయిన చౌడమ్మతల్లికి పూజలు చేస్తారు.

 

> ఈ జాతరలో పసిడి కుండను ఆలయ గోపురంపై అలంకరించేవారు- ఖాసింపేట యాదవ కులస్థులు

 

> స్వామికి మకర తోరణాన్ని ఊరేగింపుగా తీసుకుని వెళ్ళేవారు- సూర్యాపేట యాదవ కులస్థులు

 

 

> భక్తులు కుక్కల బండ్ల మీద నైవేద్యాన్ని పెట్టి కుక్కలాగ నాలుకతో నాకుతారు.

 

> నాలుగవరోజు (చివరిరోజు) పూజారులు దేవుళ్ళకు కేసారం చేయడంతో జాతర ముగుస్తుంది.

 

6. కొండగట్టు జాతర:

> ఇది కరీంనగర్ జిల్లాలోని ‘ముత్యంపేట’ సమీపంలో ఉన్నది.

 

> హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖంతో, మరోవైపున ఆంజనేయుని ముఖంలో అనగా రెండు ముఖాలతో ఉండడం ప్రత్యేకత.

 

> శంఖ, చక్రాలను కలిగిఉండి హృదయంలో సీతా, రాములను కలిగి ఉండడం విశేషం.

 

> ఈ గుడిలో 40 రోజులపాటు పూజలు చేస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

 

> ఇక్కడ జరిగే జాతరనే కొండగట్టు జాతరగా ప్రసిద్ధి.

 

ఆంజనేయస్వామి క్షేత్ర పాలకుడైన బేతాలస్వామి ఆలయం కొండపైన ఉన్నది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *